అత్యాచార ఘటనపై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-11-01T00:21:04+05:30 IST
ఒక బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ సురేంద్ర సోమవారం రాత్రి తెలిపారు. ఏలూరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పట్టేపురానికి చెందిన 45 ఏళ్ల విప్పర్తి శేఖర్ భార్య దుబాయి వెళ్లి ఇటీవల తిరిగి వచ్చింది. అప్పటి నుంచీ భర్తను పట్టించుకోవట్లేదు.
రావులపాలెం రూరల్, అక్టోబరు 31: ఒక బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ సురేంద్ర సోమవారం రాత్రి తెలిపారు. ఏలూరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పట్టేపురానికి చెందిన 45 ఏళ్ల విప్పర్తి శేఖర్ భార్య దుబాయి వెళ్లి ఇటీవల తిరిగి వచ్చింది. అప్పటి నుంచీ భర్తను పట్టించుకోవట్లేదు. దీంతో శేఖర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలిలోని బంధువుల ఇంటికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మోటారు సైకిల్‌పై రావులపాలెం మండలం పొడగట్లపల్లి వెళ్లాడు. రోడ్డు చెంతనే ఉన్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని పంటపొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను ఆమె ఇంటి సమీపంలో దింపి వెళ్లిపోయాడు. అనంతరం బాలిక కడుపునొప్పితో బాధపడుతుండడంతో పిన్ని ఆరా తీయగా విషయం బయటపడింది. చుట్టుపక్కల వారిని వివరాలడగ్గా శేఖర్ మోటారు సైకిల్‌పై దింపినట్టు తెలిపారు. బాలిక పిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్‌ఐ సురేంద్ర తెలిపారు.