Varla Ramaiah: నైతిక విలువలుంటే..సీఎం జగన్ రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2022-11-08T18:50:40+05:30 IST

AP News: సుప్రీంకోర్టు పెట్టిన చీవాట్లకు సీఎం జగన్‌ (CM Jagan)కు నైతిక విలువలుంటే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ(TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Varla Ramaiah: నైతిక విలువలుంటే..సీఎం జగన్ రాజీనామా చేయాలి

AP News: సుప్రీంకోర్టు పెట్టిన చీవాట్లకు సీఎం జగన్‌ (CM Jagan)కు నైతిక విలువలుంటే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ(TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తమ కక్ష, కార్పణ్యాలకు మమ్మల్ని భాగస్తులను చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొనడం.. జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి జగన్ గ్రహణం లాంటివాడని, ప్రజలే ఆ గ్రహణాన్ని వదిలించుకోవాలని కోరారు.

సీఎం జగన్‌ను ఉద్దేశించి వర్లరామయ్య ఇలా అన్నారు..

‘‘జగన్ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానాన్ని మీ కక్షపూరిత చర్యలకు వాడుకోవడం హాస్యాస్పదం. మీకు నైతిక విలువలుంటే సుప్రీం ధర్మాసనం పెట్టిన చీవాట్లకు సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలి. మీ స్థానంలో ఎన్టీఆర్, చంద్రబాబు, నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఉంటే రాజీనామా చేసేవారు. 2012లో మీపై ఉన్న సీబీఐ కేసుల్లో సుప్రీం వ్యాఖ్యలు చేసినప్పుడే మీరు రాజకీయంగా పతనమయ్యారు. సీఐడీని మీ వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలకు అనుబంధ సంస్థలా వాడుకుంటున్నారు. మూడున్నరేళ్లలో అరెస్టు చేసి ప్రత్యర్థులను బాధిస్తున్నారు. సీఐడీ ఒక్క కేసులో కూడా చార్జిషీట్ వేయలేదు. మీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పాలన, పారదర్శకత కనుమరుగయ్యాయి.’’ అని వర్లరామయ్య పేర్కొన్నారు.

Updated Date - 2022-11-08T18:55:35+05:30 IST