Karumuru: ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: కారుమురు
ABN , First Publish Date - 2022-11-24T19:06:59+05:30 IST
Amaravathi: రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి కారుమురు నాగేశ్వర రావు (Nagaswara Rao) తెలిపారు. ఈ విషయంలో దళారులు రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని,
Amaravathi: రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి కారుమురు నాగేశ్వర రావు (Nagaswara Rao) తెలిపారు. ఈ విషయంలో దళారులు రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని, వారి మాటలను విశ్వసించవచ్చని కోరారు. ప్రభుత్వమే కొనడం వల్ల బస్తాకు రూ.200 లాభం వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, నిన్నటి రోజున ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో రూ. 160 కోట్లు చెల్లించామని చెప్పారు. పౌర సరఫరాల శాఖకు నిధుల ఇబ్బంది లేదన్నారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ధాన్యం అమ్మిన రైతుకు వెంటనే లేదా 21 రోజుల గడువులోగా చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.