Nadendla Manohar: రైతు భరోసా కేంద్రాలే రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌గా మారాయి
ABN , First Publish Date - 2022-11-02T19:57:21+05:30 IST
రైతు భరోసా కేంద్రాలే రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌గా మారాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.
గుంటూరు: రైతు భరోసా కేంద్రాలే రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌గా మారాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. 10,700 ఆర్బీకేల్లో అవినీతి జరుగుతున్నట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారని నాదెండ్ల తెలిపారు. ఈక్రాఫ్ కోసం రైతుల దగ్గర ప్రభుత్వం లంచాలు తీసుకుందని, ధాన్యం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ (JAGAN) పాలనలో రైతులను కూడా కులాలవారీగా గుర్తిస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల వసూళ్లు పెరిగాయని జనసేన నేత నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి అరికట్టడంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, గంజాయి అరికట్టినందుకే గత డీజీపీని మార్చారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.