Palnadu: సత్తెనపల్లి 9వ వార్డులో గడప గడపకు నిరసనల వెల్లువ

ABN , First Publish Date - 2022-06-08T16:47:23+05:30 IST

సత్తెనపల్లి (Sattenapalli) 9వ వార్డులో గడప గడపకు నిరసనలు వెల్లువెత్తాయి.

Palnadu: సత్తెనపల్లి 9వ వార్డులో గడప గడపకు నిరసనల వెల్లువ

Palnadu జిల్లా: సత్తెనపల్లి (Sattenapalli) 9వ వార్డులో గడప గడపకు నిరసనలు వెల్లువెత్తాయి. అర్హత ఉన్న పింఛను ఎందుకు ఆపేరంటూ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)ను మరియమ్మ (Mariyamma) అనే మహిళ నిలదీసింది. వికలాంకుడైన తన తమ్ముడు వెంకట్రావు (Venkatarao)కు రెండేళ్లుగా పింఛన్ రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాళ్లు లేవు, చేతుల మీదుగా నడుస్తున్నాడని మంత్రి అంబటి ఎదుట మరియమ్మ కన్నీరు పెట్టుకుంది. ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్ తన పించన్ ఆపేశాడంటూ బాధితుడు వెంకట్రావు (38) ఆవేదన వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వంలో పింఛన్ తీసుకున్నానని, ఇప్పుడు సచివాలయ సిబ్బంది వల్ల పించన్ కోల్పోయానని వికలాంగుడు వాపోయాడు. దీనిపై స్పందించిన మంత్రి అంబటి.. వచ్చే నెలలో పింఛన్ వచ్చేలా చూస్తానని వారికి హమీ ఇచ్చారు.

Updated Date - 2022-06-08T16:47:23+05:30 IST