Yarapatineni: ఎన్నికలు ఎప్పుడొచ్చినా పిన్నెల్లి కుటుంబాన్ని ఓడించి..

ABN , First Publish Date - 2022-12-17T15:19:10+05:30 IST

అమరావతి: పల్నాడు జిల్లా, మాచర్ల (Macherla) ఘటనను తెలుగుదేశం పార్టీ ఓ సవాలుగా తీసుకుంటోందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasarao) అన్నారు.

Yarapatineni: ఎన్నికలు ఎప్పుడొచ్చినా పిన్నెల్లి కుటుంబాన్ని ఓడించి..

అమరావతి: పల్నాడు జిల్లా, మాచర్ల (Macherla) ఘటనను తెలుగుదేశం పార్టీ ఓ సవాలుగా తీసుకుంటోందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasarao) అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పిన్నెలి కుటుంబాన్ని (Pinneli family) ఓడించి తరరిమికొట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘‘అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.. 1994 ఎన్నికల్లో పిన్నెలి కుటుంబానికి పట్టిన గతే పునరావృతం అవుతుంది.. అధికారం శాశ్వతం కాదని హీన చరిత్ర ఉన్న మీరు గుర్తించుకోవాలి.. అధికారం మారిన రోజు మీ పోలీసులు మీరు ఉండరు, మీరెక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోండి..’’ అంటూ యరపతినేని వైసీపీ నేతలు, పోలీసులను హెచ్చరించారు.

Updated Date - 2022-12-17T15:19:14+05:30 IST