Judicial Academy: రేపు ఏపీ జ్యూడీషియల్‌ అకాడమి ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2022-12-29T21:21:42+05:30 IST

మంగళగిరికి సమీపంలోని కాజా వద్ద రూపుదిద్దుకొన్న ఆంధ్రప్రదేశ్‌ జ్యూడీషియల్‌ అకాడమి (Andhra Pradesh Judicial Academy)ని శుక్రవారం ఉదయం 9 గంటలకు..

Judicial Academy: రేపు ఏపీ జ్యూడీషియల్‌ అకాడమి ప్రారంభోత్సవం

గుంటూరు: మంగళగిరికి సమీపంలోని కాజా వద్ద రూపుదిద్దుకొన్న ఆంధ్రప్రదేశ్‌ జ్యూడీషియల్‌ అకాడమి (Andhra Pradesh Judicial Academy)ని శుక్రవారం ఉదయం 9 గంటలకు సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) ప్రారంభిస్తారు. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకొని అక్కడి హెచ్‌హెచ్‌ డైక్‌మెన్‌ ఆడిటోరియంలో ఉదయం 9.25 గంటల నుంచి జరిగే ఏపీ హైకోర్టు డిజిటైజేషన్‌, న్యూట్రల్‌ సైటేషన్‌, ఈ-సర్టిఫైడ్‌ కాపీ అప్లికేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో పాటు హైకోర్టు జడ్జీలు హాజరవుతారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో కాజాలో ఏపీ జ్యూడీషియల్‌ అకాడమి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద పటిష్టమైన బందోబస్తును జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-12-29T21:21:43+05:30 IST