Somu Veerraju: ఆ రెండు పార్టీలకు పరిపాటిగా మారింది
ABN , First Publish Date - 2022-12-17T19:41:07+05:30 IST
Amaravathi: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లపై బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపనీయంగా
Amaravathi: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లపై బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపనీయంగా ఉందన్నారు. ఫ్యాక్షన్ గొడవలు, పాత కక్షలు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎస్పీ చెప్పడం పోలీసుల పలాయన వాదంగా కనిపిస్తుందన్నారు. నేటి వైసీపీ (YCP), నాటి టీడీపీ (TDP) ప్రభుత్వాలు పార్టీ ఉనికిని, నాయకులు ఉనికిని కాపాడుకోవడం కోసం అల్లర్లు, అరాచకాలను ప్రోత్సహించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇకనైనా డీజీపీ ఘటనపై స్వయంగా వివరాలు సేకరించి, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.