భూకబ్జాలపై సమగ్ర విచారణ చేపట్టాలి
ABN , First Publish Date - 2022-12-28T23:27:39+05:30 IST
జిల్లాలో జరుగుతున్న భూ ఆక్రమణలపై నిగ్గు తేల్చాలని, అందుకోసం జిల్లా జడ్జి పర్యవేక్షణలో జేసీ, ఎస్పీ సంయుక్తంగా విచారణ చేపట్టాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం రాయచోటి పట్టణంలో ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ భూములను కాపాడుకుందాం- జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకుందాం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సీపీఎం రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
రాయచోటిటౌన్, డిసెంబరు 28: జిల్లాలో జరుగుతున్న భూ ఆక్రమణలపై నిగ్గు తేల్చాలని, అందుకోసం జిల్లా జడ్జి పర్యవేక్షణలో జేసీ, ఎస్పీ సంయుక్తంగా విచారణ చేపట్టాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం రాయచోటి పట్టణంలో ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ భూములను కాపాడుకుందాం- జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకుందాం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా ఏర్పడినప్పటి నుంచి రాయచోటి కేంద్రంగా భూకబ్జాలు ఎక్కువయ్యాయన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులను తారుమారు చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాయచోటి కేంద్రంగా జరిగిన భూకబ్జాలపై స్థానిక ఎమ్మెల్యే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. భూకబ్జాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పడంతో సరిపోదని, భూకబ్జాలకు పాల్పడిన వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర నాయకులు టి.ఈశ్వర్, భారత సాస్తిక సమా జం నాయకులు తాతయ్య, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు సగీర్, బీఎస్పీ జిల్లా నాయకులు యుగంధర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు నాగబసిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.