ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి
ABN , First Publish Date - 2022-10-26T23:07:28+05:30 IST
మండలంలోని గడ్డంవారిపల్లె వాసి కొనసాని మదన్ మోహన్‌రెడ్డి (36) బుధవారం ప్రమాద వశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు.
చక్రాయపేట, అక్టోబరు 26: మండలంలోని గడ్డంవారిపల్లె వాసి కొనసాని మదన్ మోహన్‌రెడ్డి (36) బుధవారం ప్రమాద వశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు... మదన్‌మోహన్‌రెడ్డి ట్రాక్టర్ ట్యాంకర్‌తో మామిడి తోటకు నీరు తోలేందుకు వెళు తుండగా... మిట్టపైకి ఎక్కే సమయంలో ఇంజన్ టైర్లు లేవడంతో ట్రాక్టర్ ట్రాలీకి, ఇంజన్‌కు మధ్యలో పడ్డాడు. దీంతో మదన్ మోహన్‌రెడ్డి అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లెకు తరలించారు. టీడీపీ కార్యకర్త కావడంతో మండల ఇన్‌చార్జిలు మహే శ్వర్‌రెడ్డి, షబ్బీర్ తదితరులు మృతదేహాన్ని పరిశీలించి సంతాపం తెలిపారు.