Viveka case: ఆ ఐదుగుర్ని విచారించాలని తులసమ్మ వాంగ్మూలం

ABN , First Publish Date - 2022-11-26T14:20:09+05:30 IST

వైఎస్ వివేక హత్య కేసు(Viveka murder case)లో ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చింది. పులివెందుల కోర్టు(Pulivendula Court)లో మేజిస్ట్రేట్ ముందు తులసమ్మ వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి

Viveka case: ఆ ఐదుగుర్ని విచారించాలని తులసమ్మ వాంగ్మూలం
తులసమ్మ వాంగ్మూలం

కడప: వైఎస్ వివేక హత్య కేసు(Viveka murder case)లో ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చింది. పులివెందుల కోర్టు(Pulivendula Court)లో మేజిస్ట్రేట్ ముందు తులసమ్మ వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ వేసింది. వివేకా కేసులో మరో ఆరుగురుని సీబీఐ(CBI) విచారించాలని తులసమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివ ప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ విచారించే విధంగా ఆదేశించాలని కోరింది. తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత పులివెందుల కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది.

Updated Date - 2022-11-26T14:20:10+05:30 IST