రోడ్డు ఏర్పాటుకు భూపేష్ రెడ్డి కృషి
ABN , First Publish Date - 2022-10-18T04:47:39+05:30 IST
మండలం లోని నర్సోజి కొట్టాల నుం చి కట్టకింద మారెమ్మ గుడి వరకు గ్రావెట్ రోడ్డు ఏర్పాటుకు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేష్ రెడ్డి చర్యలు తీసుకున్నారు.
జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 17: మండలం లోని నర్సోజి కొట్టాల నుం చి కట్టకింద మారెమ్మ గుడి వరకు గ్రావెట్ రోడ్డు ఏర్పాటుకు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేష్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. పెన్నానది వరదల కార ణంగా రోడ్లు కోతకు గురై ఈ మార్గంలోని సుమారు 18 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో భూపేష్ రెడ్డి తన సొంత నిధులతో పనులు చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీను, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పర్యవేక్షిస్తున్నట్లు పొన్నతోట గ్రామస్థులు చెబుతున్నారు.