రాయచోటిలో కొవిడ్‌ మాక్‌డ్రిల్‌

ABN , First Publish Date - 2022-12-27T22:53:16+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధతలో భాగంగా మంగళవారం రాయచోటి ఏరియా ఆసుపత్రిలో డీహెచ్‌పీఎ్‌స డాక్టర్‌ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండయ్యల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

రాయచోటిలో కొవిడ్‌ మాక్‌డ్రిల్‌
ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డును పరిశీలిస్తున్న వైద్యులు

రాయచోటి టౌన్‌, డిసెంబరు 27: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధతలో భాగంగా మంగళవారం రాయచోటి ఏరియా ఆసుపత్రిలో డీహెచ్‌పీఎ్‌స డాక్టర్‌ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండయ్యల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కొవిడ్‌ కేసులు ఆసుపత్రికి వస్తే వారికి చేపట్టాల్సిన పరీక్షలు, అందుకు అవసరమైన పరికరాలు, మందులు, బెడ్లు ముందస్తుగా సిద్ధం చేశారు. అలాగే ఐసోలేషన్‌ వార్డు, ఆక్సిజన్‌ ప్లాంటు, ఆక్సిజన్‌ సిలిండర్‌లను సిద్ధం చేశారు. కొవిడ్‌ కేసులు పునరావృతమైతే వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చి సంసిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్లు శారద, లక్ష్మిప్రసాద్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-27T22:53:17+05:30 IST