గజ్జెల మల్లారెడ్డి ఈ ప్రాంతవాసి కావడం గర్వకారణం

ABN , First Publish Date - 2022-12-26T23:23:38+05:30 IST

కపటత్వంపై యుద్ధభేరి మోగించిన గజ్జెల మల్లారెడ్డి ఈ ప్రాంత వాసి కావడం గర్వకారణమని వైవీయూ వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావతి అన్నారు.

గజ్జెల మల్లారెడ్డి ఈ ప్రాంతవాసి కావడం గర్వకారణం
విజయబాబుకు అవార్డును అందిస్తున్న వీసీ సూర్యకళావతి తదితరులు

వైవీయూ వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావతి

గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం విజయబాబుకు అందజేత

కడప (ఎడ్యుకేషన్‌) డిసెంబరు 26 : కపటత్వంపై యుద్ధభేరి మోగించిన గజ్జెల మల్లారెడ్డి ఈ ప్రాంత వాసి కావడం గర్వకారణమని వైవీయూ వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావతి అన్నారు. వైవీయూలో సోమవారం గజ్జెల మల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబుకు గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఉపకుల పతి సూర్యకళావతి ఆయనకు సన్మానపత్రం, జ్ఞాపికతో పాటు రూ.50వేలు నగదు అంద జేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాక్చాతుర్యం, ఉపన్యాస పటిమ, మహోన్నత వ్యక్తిత్వం, ఉత్తమ జర్నలిస్టు లక్షణాలు కలిగిన మల్లారెడ్డి నేటి తరానికి ఆదర్శనీయులన్నారు. బాల్యదశలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మల్లారెడ్డి గొప్ప వ్యక్తిగా ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఉపన్యాసాల కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎడ్లబండ్లు పట్టుకుని హాజరయ్యేవారంటే ఆయన వాగ్ధాటి ఎంత ప్రభావవంతమో అర్థం చేసుకోవాలన్నారు. గజ్జెల మల్లారెడ్డి ట్రస్టు సమన్వయకర్త ప్రొఫెసర్‌ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జనాన్ని మేల్కొలిపే తత్వం గజ్జొ మల్లారెడ్డి సాహిత్యంలో కనిపిస్తుందన్నారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిశోధన సంస్థ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు గజ్జెల మల్లారెడ్డి కవితా ఖండికలు నిప్పుకణికల్లాంటివని... కుండబద్దలు కొట్టినట్లు చెప్పే మనసత్త్వం వాటిలో కనిపిస్తుందన్నారు. కవిత్వాన్ని కలబోసి వార్తా శీర్షికలను నిర్వహించిన తొలి వ్యక్తిగా చెప్పుకుంటామన్నారు. రాయలసీమ ప్రాంతపు గుండె చప్పుడుగా ప్రాంతీయ అస్తిత్వాన్ని జీవన గమనాన్ని అక్షరబద్ధం చేసి జర్నలిస్టుగా గుర్తింపు పొం దారన్నారు. అనంతరం ప్రొఫెసర్‌ క్రిష్ణారెడ్డి , బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థి సేవా విభాగం సంచాలకు లు ఎల్‌.విజయక్రిష్ణారెడ్డి, గజ్జెల మల్లారెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కార గ్రహీత విజయబాబు ప్రసంగించారు. డీన్‌ ప్రొఫెసర్‌ తప్పె ట రాంప్రసాద్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-26T23:23:42+05:30 IST