గండికోట లోయ తపాలా కవరు ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-02-01T05:50:35+05:30 IST

గండికోట లోయ చిత్రంతో తపాలా కవరును పోస్టల్‌ శాఖ విడుదల చేసింది. సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌పోస్టాఫీసులో ప్రొద్దుటూరు పోస్టల్‌ డివిజన్‌ అధికారులు గండికోట లోయ (ది గ్రేట్‌ కెనాన ఆఫ్‌ ఇండియా) పైన ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేశారు.

గండికోట లోయ తపాలా కవరు ఆవిష్కరణ
గండికోట లోయ చిత్రంతో ఏర్పాటు చేసిన పోస్టల్‌ కవరును ఆవిష్కరిస్తున్న ఆర్డీవో శ్రీనివాసులు, పోస్టల్‌ శాఖ ఎస్పీ ఆదినారాయణ

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 31: గండికోట లోయ చిత్రంతో తపాలా కవరును పోస్టల్‌ శాఖ విడుదల చేసింది. సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌పోస్టాఫీసులో ప్రొద్దుటూరు పోస్టల్‌ డివిజన్‌ అధికారులు గండికోట లోయ (ది గ్రేట్‌ కెనాన ఆఫ్‌ ఇండియా) పైన ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ గండికోట సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినదన్నారు. టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి గండికోటలో త్వరలో ఒక స్టార్‌ హోటల్‌ ఏర్పాటు కానుందన్నారు. ప్రొద్దుటూరు పోస్టల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఆదినారాయణ మాట్లాడుతూ పార్లమెంటులో ఆమోదం పొందడం, తర్వాత కమిటీ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోస్టల్‌ వారి ఆదేశాలతో ది గ్రాండ్‌ కెనాన ఆఫ్‌ ఇండియాగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్న సహజ సిద్ధమైన గండికోట చిత్రంతో తపాలా కవరు విడుదల చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు మధుసూదన్‌రెడ్డి, ఏఎస్పీ నీలిమ, ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌, పురావస్తుశాఖ అధికారి రాజా యోగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-01T05:50:35+05:30 IST