సీపీఎస్ రద్దు కోరితే.. అరెస్టులా?
ABN , First Publish Date - 2022-10-29T22:45:34+05:30 IST
లక్షల మంది ఉద్యోగులను నిర్వేదంలోకి నెట్టేసిన సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయమంటే అరెస్ట్ వారంట్స్ పంపుతారా అని బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయచోటి రవిశంకర్, షేక్. అబ్దుల్‌రజాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాయచోటిటౌన్, అక్టోబరు 29: లక్షల మంది ఉద్యోగులను నిర్వేదంలోకి నెట్టేసిన సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయమంటే అరెస్ట్ వారంట్స్ పంపుతారా అని బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయచోటి రవిశంకర్, షేక్. అబ్దుల్‌రజాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం స్థానిక బీటీఏ కార్యాలయంలో వారు మాట్లాడారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీటీఏ నాయకులు ఖాజారహంతుల్లా, మాసా ప్రసాద్, వెంకట్రమణకు అరెస్టు వారంట్లు పంపడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అన్నారు. ప్రభుత్వం వెంటనే సరైన ఫార్మాట్‌లో జీవోలు కోర్టుకు సమర్పిం చాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. శ్రీని వాసులు, జిల్లా నాయకులు మస్తాన్‌వలి, సిరాజుద్దీన్, వేణుగోపాల్ నాయక్‌లు పాల్గొన్నారు.