జగనన్న పాలనంతా ‘బాదుడే బాదుడు’
ABN , First Publish Date - 2022-09-17T05:28:48+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనంతా బాదుడే బాదుడు అని మండల టీడీపీ కన్వీనర్ బైరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుదా అంకిరెడ్డి అన్నారు
వీరపునాయునిపల్లె, సెప్టెంబరు 16: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనంతా బాదుడే బాదుడు అని మండల టీడీపీ కన్వీనర్ బైరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుదా అంకిరెడ్డి అన్నారు. శుక్రవారం మండంలోని ఎన్ పాలగిరి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతుల కోసం అమలు చేసిన పెళ్లికానుకను మూడున్నరేళ్లపాటు నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికలు రానుండడంలో మళ్లీ అమలు చేస్తున్నారన్నారు. విద్యు త్ చార్జీలు పెంచి, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ తాడేపల్లి ఖజానాను నింపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాములయ్య, తలపనూరు గంగిరెడ్డి, మాజీ సర్పంచు నాగముని రెడ్డి, విశ్వనాథరెడ్డి సీతారామయ్య, రాజారెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
పుత్తా చొరవతోనే.. చదిపిరాళ్ల చెరువు నీళ్లు
కమలాపురం రూరల్, సెప్టెంబరు 16 : రైతుల సంక్షేమం కోసం పుత్తా నరసింహారెడ్డి తన సొంత నిధులతో పాపాగ్ని నుంచి నీరు తెప్పించాడని టీడీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఆసుపత్రి కమిటీ మాజీ చైర్మన్ జంపాల నర సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం సంబటూరు గ్రామ పంచాయతీలోని మునుకోనుపల్లి, సంబటూరుల్లో బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహిం చారు. ఆర్థిక భారం నుంచి ప్రజలు గట్టెక్కాలంటే తెలుగుదేశం పార్టీ అధి కారంలోకి రావాలన్నారు. మండల కన్వీనర్ రాఘవరెడ్డి, దివాకర్‌రెడ్డి, కంకరసుబ్బారెడ్డి, కడప జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షుడు శంకర్‌యాదవ్, కార్యదర్శి ఇరగనబోయిన హరికృష్ణ యాదవ్, కమలాపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుల్లగూర శ్రీనివాసులు, చెన్నకృష్ణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, చిన్నచెప్పలి రామ్మోహన్‌రెడ్డి, పల్లె రామసుబ్బారెడ్డి, శ్రీను, ఆర్‌అండ్‌బి రమణ, శేషాద్రి, ప్రవీణ్, ఐటీడీపీ నరసింమ, నబీ, మాజీ సర్పం చ్ గోపాల్, కాపు నాయకుడు మల్లేష్‌రాయల్, టీడీపీ నాయకులు కార్యకర్త లు పాల్గొన్నారు.