లాభదాయకం... నాటు కోళ్ల పెంపకం
ABN , First Publish Date - 2022-11-20T23:24:10+05:30 IST
నాటు కోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటు కోడి గుడ్లు, మాంసం బలవర్ధకమైనది. కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా పెంచుతుంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నాటుకోడి పెంపక కేంద్రాలు
తగ్గని డిమాండ్
కిలో మాంసం రూ.600
పొట్టేలు, మేకపోతు కంటే పెరుగుతున్న గిరాకీ
రైల్వేకోడూరు, నవంబరు 20: నాటు కోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటు కోడి గుడ్లు, మాంసం బలవర్ధకమైనది. కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా పెంచుతుంటారు. ఇళ్ల ముంగిటే నాటు కోళ్లు తిరుగుతుంటాయి. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటు కోళ్ల పెంపకా లు సాగిస్తున్నారు. పొట్టేలు, మేకపోతు మాంసం కిలో రూ. 800 ఉంటే నాటు కోడి మాంసం కిలో రూ. 600 లకు విక్రయిస్తున్నారు. నాటు కోళ్ల పెంపకం లాభాల ను గడిస్తున్నాయని చాలా మంది పెంపక కేంద్రాలు చేస్తున్నారు. నాటు కోడికి ఇప్పటికీ మార్కెట్‌లో తగ్గ డంలేదు. బ్రాయిలర్, లింగాపురం కోళ్ల కంటే నాటుకోడి మాంసం బాగుంటుంది. రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు తదితర మండలాల్లో నాటు కోళ్ల పెంపకాలు సాగుతున్నాయి. ఆదాయం బాగుందని ఇతర ప్రాంతాలకు కోళ్లను ఎగుమతి చేస్తున్నారు. కోడి బరువును బట్టి తూకం వేసి అమ్మకాలు చేస్తున్నారు.
ఒక్క కోడి రూ. 700 నుంచి రూ. 1000లకు విక్రయిస్తున్నారు. తమిళనాడు, కేరళ, బెంగుళూరు, తిరుపతి, కడప, రాజంపేట తదితర ప్రాంతాలకు నాటు కోళ్లను ఎగుమతి చేస్తున్నా రు. చాలా మంది రైతులు ఉద్యాన పంటలు చాలించి నాటు కోడి పెంపకాలు చేపట్టారు. నాటు కోడి పిల్లలు దూర ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి పెంచుతున్నా రు. సజ్జలు, రాగులు, జొన్నలు తదితర వాటిని మేత గా వేస్తున్నారు. విశాలమైన షెడ్లు నిర్మించి కోడి పిల్లలకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. బ్రాయిలర్, లింగాపురం కోళ్లు నెల నుంచి రెండు నెలల లో పు మార్కెట్‌కు వచ్చేస్తాయి. నాటు కోడి మాత్రం బొ మ్మి పిల్ల నుంచి పెద్ద కోడి వరకు సుమారు 6 నెలల పైగా పడుతుంది. ఇది ఇలా ఉండగా నాటు కోడి గు డ్డులో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. పచ్చసొనలో విటమిన్-ఏ, బి-కాంప్లెక్స్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చెడు అవలక్షణాలను తొలగిస్తుంది.
పచ్చసొనతో గుడ్డును తినాలని వైద్యులు చెబుతున్నా రు. మనిషిలో మంచి కొవ్వును ఉత్పత్తి చేస్తుంది. నాటు కోడి మాంసం 100 గ్రాముల్లో 22 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. శరీరానికి ఉష్ణోగ్రతను పెంపుద ల, కండ పుష్టి ఇస్తుంది. ఈ నేపథ్యంలో నాటు కోళ్లలో మేలు జాతి కోళ్లు కూడా ఉన్నాయి. ఈ కోళ్లను కోడి పందేల కోసం పెంచుతుంటారు. ఇందులో సేలం కోళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. నాటు కోళ్లు ఎక్కువ గుడ్లు పెడతాయి. జాతి కోడి పెట్టలు తక్కువగా పెడతాయి. వీటిని క్రాస్ చేయించి మంచి మే లు జాతి కోళ్లను పొందుతుంటారు. పందే లకు తీసుకెళ్లే కోడి పుంజులకు జీడి పప్పు, బాదం తదితర బలవర్ధకమైన ఆహారం పెడతారు. ప్రత్యేకంగా వీటికి చర్యలు తీసుకుంటారు.
కట్టేసి మేపుతారు. డేగ, కాకి డేగ, గాజు, తెల్ల, నల్ల, నెమలి తదితర రకాల పేర్ల తో జాతి కోళ్లను పిలుస్తా రు. ఈ కోళ్లకు ఈత నేర్పిస్తారు. పందెం ఎలా చేయాలో తర్ఫీ దునిస్తారు. జాతి కోళ్లు ధరలు రూ. 5000 నుంచి 1,00000 వరకు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా కోళ్లను తీసుకు వచ్చి పెంచుతారు. ఇలా పందేలకు వినియోగించే కోళ్లను తయారు చేసి పెంప కం దారులు ఆదాయం పొందుతున్నారు.