జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ

ABN , First Publish Date - 2022-12-22T23:23:11+05:30 IST

విద్యలోనే కాదు.. ఆటలు, పాటలు, విజ్ఞానం ఎటువంటి పోటీలు అయినా సై అంటూ ముందుకు సాగుతున్నారు.. నందలూరు జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు.

జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ
పోటీల్లో పాల్గొన్న ఆంధ్ర టీం, కోచ్‌ సునీత

నందలూరు, డిసెంబరు 22: విద్యలోనే కాదు.. ఆటలు, పాటలు, విజ్ఞానం ఎటువంటి పోటీలు అయినా సై అంటూ ముందుకు సాగుతున్నారు.. నందలూరు జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు. మహాత్మాజ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల, నందలూరు నుంచి బీహార్‌లో ఈ నెల 14-18వ వరకు బీహార్‌ రాష్ట్రం సరాన్‌లో జరిగిన 37వ జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలలో 10వ తరగతి చదువుతున్న బి.పూజిత తన ప్రతిభ చూపింది. అదే విధంగా ఏపీ హ్యాండ్‌బాల్‌ జట్టుకు ఇదే పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయురాలు జి.సునీత కోచ్‌గా వ్యవహరించారు.

సైన్స్‌ ఫెయిర్‌ పోటీలకు ఎంపిక

మహాత్మాజ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరు విద్యార్థునులు ఈ నెల 19న నందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో మిత్తికాయల మానస, కొప్పల పావన, సౌమ్య చేసిన ఆరోగ్యం పరిశుభ్రత (హెల్త్‌ అండ్‌ ఐజిన్‌) ఎగ్జిబిట్‌ ధర శిరీష, దూదేకుల మేహతాజ్‌ చేసిన (అప్లికేషన్‌ ఆఫ్‌ ట్రిగనామెట్రీ) ప్రాజెక్టులు (ఎగ్జిబిట్‌లు) రెండు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. వీటికి గైడ్స్‌గా బయోలాజికల్‌ ఉపాధ్యాయురాలు పద్మ, గణిత ఉపాధ్యాయురాలు అపర్ణ వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మౌనిక మాట్లాడారు. భవిష్యత్తులో తమ పాఠశాల, కళాశాల విద్యార్థులు అనేక విజయాలు సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-22T23:23:13+05:30 IST