గువ్వల చెరువు ఘాట్‌లో బస్సు బోల్తా
ABN , First Publish Date - 2022-11-20T23:10:05+05:30 IST
చింతకొమ్మదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్‌లో అయ్యప్పస్వాములు ప్ర యాణిస్తున్న బస్సు బోల్తాపడిన ఘటనలో అయ్యప్ప స్వాములకు పెనుప్రమాదం తప్పి ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు.
అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం
సికెదిన్నె, నవంబరు 20: చింతకొమ్మదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్‌లో అయ్యప్పస్వాములు ప్ర యాణిస్తున్న బస్సు బోల్తాపడిన ఘటనలో అయ్యప్ప స్వాములకు పెనుప్రమాదం తప్పి ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు రాజమండ్రి నుంచి బయల్దేరిన అయ్యప్పస్వాము ల బస్సు గువ్వలచెరువు ఘాట్ మూడో మలుపు వద్ద ఘాట్ ఎక్కుతున్న సం దర్భంలో డీజిల్ అయిపోవడంతో బస్సు డ్రైవర్ వెనక్కు తీసుకొచ్చి పక్కనపెట్టాలనే ప్రయత్నంలో కంట్రోల్ కాక రోడ్డుకు అడ్డంగా పడిపోయిందన్నారు.
ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ముగ్గురు భక్తులకు స్వల్పగాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వారు పుష్పాల మాణిక్యం, గుర్రాల సూ ర్యకుమారి, వర్షిణి తూ.గో.జిల్లా కొత్తపల్లె మండలానికి చెందినవారుగా గుర్తించారన్నారు. అయితే ఘటన విషయం తెలుసుకుని సికెదిన్నె ఎస్‌ఐ, డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, పోలీసు సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన అయ్యప్ప భక్తులను ఆస్పత్రికి తరలించి మిగతా భక్తులను రోడ్డుకు అడ్డం లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగేలా చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.