Delhi liquor scam... నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ABN , First Publish Date - 2022-11-21T15:12:47+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నిందితులు శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Delhi liquor scam... నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు(Delhi liquor scam case)లో నిందితులు శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందని ఈడీ పేర్కొంది. ఈడీ అభ్యర్థనతో శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. జైలులో బినోయ్ బాబుకు వాటర్ ఫ్లాస్క్, ఇంటి భోజనం, రెండు జతల బట్టలు, ఉలెన్ బట్టలు, షూస్‌ను కోర్టు అనుమతించింది. అలాగే శరత్ చంద్రారెడ్డికి ఇంటి భోజనం అనుమతించడంతో పాటు... క్రోనిక్ బ్యాక్ పెయిన్ కోసం వైద్య చికిత్స, హైపర్ టెన్షన్ మందులు, ఉలెన్ బట్టలు, షూస్‌కు అంగీకారం తెలిపింది. జైలులో ఇద్దరికి వైద్య సహాయం అందించాలంటూ తీహార్ జైలు అధికారులకు రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ... తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది.

Updated Date - 2022-11-21T15:17:00+05:30 IST