పవర్ లిఫ్టింగ్ విజేత మురళీకృష్ణకు కొనకళ్ల, రవీంద్ర అభినందన
ABN , First Publish Date - 2022-09-05T06:47:00+05:30 IST
క్రీడాకారులు మురళీకృష్ణను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మచిలీపట్నం టౌన్ : క్రీడాకారులు మురళీకృష్ణను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రజిత పతకం సాధించిన దోనె మురళీకృష్ణను వారిద్దరూ ఇంటికి వెళ్లి అభినందించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, పిప్పళ్ళ వెంకట కాంతారావు, గోకుల శివ తదితరులు పాల్గొన్నారు.