అగ్నిప్రమాదాలపై అవగాహన
ABN , First Publish Date - 2022-04-21T06:04:38+05:30 IST
అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని కొత్తపేట అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొత్తపేట అగ్నిమాపక కేంద్రం వద్ద ప్రజలకు అగ్నిమాపక పరికరాలు, ప్రమాదాలపై కొత్తపేట అగ్నిమాపక శాఖాధికారి తలశిల శ్రీనివాసరావు అవగాహన నిర్వహించారు.
అగ్నిప్రమాదాలపై అవగాహన
చిట్టినగర్, ఏప్రిల్ 20: అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని కొత్తపేట అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొత్తపేట అగ్నిమాపక కేంద్రం వద్ద ప్రజలకు అగ్నిమాపక పరికరాలు, ప్రమాదాలపై కొత్తపేట అగ్నిమాపక శాఖాధికారి తలశిల శ్రీనివాసరావు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ వినియోగించే పరికరాలను ప్రదర్శించారు. ముఖ్యంగా గ్యాస్ ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఎం.జ్ఞానరాజు కె.హరిబాబు, బీ.రాంబాబు, ఆర్.శరత్‌కుమార్, కె. సుధాకర్, వీవీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.