క్రీడాకారులకు హాకీ స్టిక్స్‌, బాల్స్‌ పంపిణీ

ABN , First Publish Date - 2022-09-14T06:09:56+05:30 IST

హాకీ క్రీడలో రాణించి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్‌బీఐ డీజీఎస్‌ వి. భవానీ ప్రసాద్‌ అన్నారు.

క్రీడాకారులకు  హాకీ స్టిక్స్‌, బాల్స్‌ పంపిణీ
క్రీడాకారులకు హాకీ కిట్స్‌ను అందజేసిన భవానీ ప్రసాద్‌

క్రీడాకారులకు  హాకీ స్టిక్స్‌, బాల్స్‌ పంపిణీ

అజిత్‌సింగ్‌నగర్‌, సెప్టెంబరు 13 : హాకీ క్రీడలో రాణించి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్‌బీఐ డీజీఎస్‌ వి. భవానీ ప్రసాద్‌ అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్‌ స్టేడియంలో హాకీ క్రీడాకారులకు మంగళవారం ఆయన హాకీ స్టిక్స్‌, బాల్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎప్పుడు అవసరం వచ్చినా తన వంతు సహాయం అందిస్తానని పేర్కోన్నారు. వీఎస్‌ఆర్‌ శేఖర్‌, కె. బడారి బాబు, శ్రీనివాసరావు, ప్రభుకుమార్‌, అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-14T06:09:56+05:30 IST