AP News: వైఎస్సార్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు: గవర్నర్
ABN , First Publish Date - 2022-11-01T12:41:11+05:30 IST
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారని గవర్నర్ కొనియాడారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో జరిగింది. వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది కళాకారులు ఉన్నారని, ఎన్నో కళలు ఉన్నాయని, ఎంతో గొప్ప సంస్కృతి ఉందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేశారన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అవార్డులు అందుకుంటున్న వారందరికీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ అభినందనలు తెలియజేశారు.