Biswabhushan Harichandan: కందుకూరు ఘటనపై ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2022-12-29T11:52:37+05:30 IST

నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Biswabhushan Harichandan: కందుకూరు ఘటనపై ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి

విజయవాడ: నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhusan harichandan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం అత్యంత భాధాకరమన్నారు. గాయాలు అయిన వారి సమాచారంపై గవర్నర్ ఆరా తీశారు. స్ధానిక అధికార యాంత్రంగం గాయపడ్డ వారికి సరైన చికిత్స అందించాలంటూ ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Updated Date - 2022-12-29T11:52:39+05:30 IST