రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2022-01-30T06:21:29+05:30 IST

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మె ల్సీ కె.ఎస్‌. లక్ష్మణరావు అన్నారు. మచిలీపట్నం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం యూటీఎఫ్‌ ఎఫ్‌ కార్యాలయంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి - పరిరక్షణ అనే అంశంపై సదస్సు జరిగింది.

రాజ్యాంగ  పరిరక్షణ అందరి బాధ్యత

 ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 29 : భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మె ల్సీ కె.ఎస్‌. లక్ష్మణరావు అన్నారు. మచిలీపట్నం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం యూటీఎఫ్‌ ఎఫ్‌ కార్యాలయంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి - పరిరక్షణ అనే అంశంపై సదస్సు జరిగింది.  కె.ఎస్‌. లక్ష్మణరావు ముఖ్యఅతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రచించిన రాజాం్యగంలోని ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలను అనుసరించి ప్రజాపాలన, చట్టాలు రూపొందాయని, వాటికి అనుగుణంగా పాలన సాగించాలన్నారు.  ఫెడరల్‌ వ్యవస్థ, సామాజిక, న్యాయం, లౌకికవాదం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వంవిఘాతం కలిగిస్తోందన్నారు. ఈ సదస్సులో కమిటీ కన్వీనర్‌ ఎం.డి.సిలార్‌, కొడాలి శర్మ, లెనిన్‌, వి. జ్యోతి, పి. సుబ్రహ్మణ్యం, సిహెచ్‌. రాజేష్‌, కొల్లాటి శ్రీనివాసరావు, కె.ఏ. ఉమామహేశ్వరరావు, వేము కోటేశ్వరరావు, ఆర్‌. వెంకట్రావు, సిహెచ్‌. జయరావు, వి.వి.రమణ తదితరులు మాట్లాడారు.

Updated Date - 2022-01-30T06:21:29+05:30 IST