Raghurama: కొట్టింది సునీల్ కుమార్, వీడియోలో చూసింది జగన్..
ABN , First Publish Date - 2022-12-15T15:44:04+05:30 IST
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Modi) నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) లేఖ (Letter) రాశారు. పోలీసులు చేసిన కస్టోడియల్ టార్చర్‌పై లేఖ రాశారు.
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Modi) నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) లేఖ (Letter) రాశారు. పోలీసులు చేసిన కస్టోడియల్ టార్చర్‌పై లేఖ రాశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ప్రివిలైజ్ కమిటీ (Parliament Privileges Committee) విచారణకు ఇంకా అధికారులను పిలవలేదని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. తనను ఎవరు కొట్టారో ఇంకా విచారణ జరపలేదని, త్వరగా విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరినట్లు తెలిపారు. తనను కొట్టింది సునీల్ కుమార్ అని, వీడియోలో చూసింది సీఎం జగన్ (CM Jagan) అని, దీని వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు.
జగనన్న అవినీతి విరామ పథకం..
ఏపీలో అవినీతి విరామ పథకం సీఎం జగన్ వలనే అయిందని, అవినీతి చేయొద్దని.. కొద్ది రోజులు ఆపాలని మంత్రులకు సలహాలు ఇచ్చారని రఘురామ అన్నారు. ఉద్యమంలా రాష్ట్రంలో అవినీతి జరుగుతుందన్నారు. ల్యాండ్, ఇసుక, వైన్, మైన్ అన్నిట్లో దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుతో ఎంతోమంది భవన కార్మికులు మట్టిలో కొట్టుకుపోయారన్నారు. బంగారం కన్నా ఇసుకకు ఇంత రేటు ఉంటుందని అనుకోలేదన్నారు. వైన్‌లో వేల కోట్లు దోచేస్తున్నారని, ఈ భూమండలంలో ఎవరు చేయని విధంగా చెత్తమద్యం ఏపీలో తయారు చేస్తున్నారన్నారు.
ఆడాళ్ళు మీకు జోహార్లు
ముఖ్యమంత్రి సభలకు వెళుతున్న మహిళలకు రఘురామ జోహార్లు అన్నారు. మీటింగులకు మహిళలను బలవంతంగా తీసుకెళ్తున్నారని, మహిళలు అవమానాలు తట్టుకొని గోడలు దూకి పారిపోతున్నారని అన్నారు. మహిళలందరూ కలిసి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎందుకు తీసేస్తారని ప్రశ్నించారు. జగన్, సాయిరెడ్డి జేబుల్లో నుంచి పథకాలు ఇవ్వడం లేదన్నారు. వాలంటీర్లు పథకాలు తీసేస్తామంటే.. వారు జేబుల్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని రఘురామ అన్నారు.