Home » Raghurama krishnam raju
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
తన కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రఘురామ కృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. తనను దారుణంగా చిత్రవధ చేశారని.. చంపాలని చూసారని అన్నారు. అందుకు సాక్ష్యంగా మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు. న్యాయం గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును విజయ్‌పాల్ ఆశ్రయించారు.
రఘురామ ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడతారని.. ఆయనకు కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్లుగా రఘురామ చెబుతారని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిందని రఘురామ గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసును ప్రభుత్వం ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు.
Telangana: జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిందే అని.. ఎవరైనా తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని ఎమ్మెల్యే రఘురామ స్పష్టం చేశారు. మతపరంగా అన్య మతస్థుడు తిరుపతి వెళ్లాలంటే హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్నారు.
Andhrapradesh: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై దాడి కేసులో పరారీలో ఉన్న సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ కోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు విచారణకు వచ్చింది. అయితే విజయపాల్‌కు ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ హాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్లో వైసీపీ అధినేత జగన్ భుజంపై చెయ్యి వేసి మరీ రఘురామ కృష్ణరాజు మాట్లాడటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
గుంటూరు జిల్లా: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై కేసు నమోదయింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు.