ముదినేపల్లిని కృష్ణాలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-02-02T06:18:50+05:30 IST

ముదినేపల్లిని కృష్ణాలోనే కొనసాగించాలి

ముదినేపల్లిని కృష్ణాలోనే కొనసాగించాలి
ఎమ్మెల్యేకు మెమోరాండం అందజేస్తున్న వైసీపీ నేతలు

ముదినేపల్లి: కొత్త జిల్లాల ఏర్పాటులోముదినేపల్లి మండలాన్ని మచిలీపట్నం కేంద్రం గా ఉన్న కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ మండల నేతలు ఎమ్మె ల్యే దూలం నాగేశ్వరరావుకు మెమోరాండం అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు, జడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ, ఏఎంసీ వైస్‌ చౌర్మన్‌ బొర్రా శేషు, వైసీపీ నేతలు ఈడే వెంకటేశ్వరరావు, వర్రే నాగేంద్రం తదితరులు మంగళవారం ఎమ్మెల్యేను కలిశారు. మండలాన్ని కృష్ణాలోనే ఉంచాలని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. 

ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో..

ముదినేపల్లి మండలాన్ని కృష్ణాజిల్లాలోనే ఉంచాలని ఏపీటీఎఫ్‌ నాయకులు తహసీల్దార్‌ శ్రీనివా్‌సకు వినతిపత్రం అందజేశారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్ర ప్రసాద్‌, నాయకులు సీవీఎల్‌ నరసింహారావు, చక్రధర్‌, జాన్సన్‌బాబు, ఆర్‌.శ్రీహరి తదితరులు మెమోరాండం అందజేసి కొత్త జిల్లాలో కలిపితే ఉపాధ్యాయుల సర్వీసు సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-02T06:18:50+05:30 IST