పేదల నాయకుడు వీఎం రంగా
ABN , First Publish Date - 2022-12-27T00:58:48+05:30 IST
కులమతాలకతీతంగా పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేదల నాయకు డిగా వారి గుండెల్లో కొలువై ఉన్నాడని మాజీ ఎమ్మె ల్యేలు బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
పెనమలూరు, డిసెంబరు 26 : కులమతాలకతీతంగా పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేదల నాయకు డిగా వారి గుండెల్లో కొలువై ఉన్నాడని మాజీ ఎమ్మె ల్యేలు బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం రంగా 34వ వర్ధంతిని పురస్కరించుకుని యనమలకుదురు లాకుల వద్ద రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధా చేతుల మీదుగా రంగా విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పార్టీలకతీతంగా సమాజంలో పేదల పక్షాన నిలిచి పోరాడిన తన తండ్రి రంగా విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ బుజ్జి, సూదిమళ్ల రవీంద్ర, దొంతగాని పుల్లేశ్వరరావు, అనంతనేని ఆజా ద్, ప్రత్తిపాటి వెంకటేష్, మాదాల ప్రభాకర్, నత్తల వంశీకృష్ణ, మహిళా నాయకురాళ్లు యార్లగడ్డ సుచిత్ర, మేడసాని రత్నకుమారి, బొప్పన నీరజ, సౌజన్య, షకీలా, రంగా అభిమానులు లంకా కృష్ణారావు, లంకా నారాయణరావు, కమ్మిలి నాగేశ్వరరావు, బోయిన కొండ, మాదాసు రాము, వెన్నా శివశంకర్, బొలిశెట్టి వంశీకృష్ణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
కంకిపాడులో..
కంకిపాడు : మండలంలోని వివిధ గ్రామాల్లో రంగా వర్థంతి కార్యక్రమాన్ని రధారంగా మిత్ర మం డలి, చిరంజీవి యువత, వైసీపీ నాయకులు వేర్వేరు నిర్వహించారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వ హించిన రంగా వర్ధంతిలో కంకిపాడు వైస్ ఎంపీపీ దూళిపూడి కిషోర్, ఏఎంసీ చైర్మన్ మద్దాలి రామచంద్ర రావు, జెడ్పీటీసీ బాకి బాబు, కంకిపాడు ఉపసర్పంచ్ రాచూ రి చిరంజీవి, ఎంపీటీసీలు కోనా కిషోర్, బుడ్డి యువ సేన అధ్యక్షులు కొప్పరాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా చిరంజీవి యువత ఆధ్వ ర్యంలో నిర్వహించిన రంగా వర్థంతి కార్యక్రమంలో చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగు జయప్రకాష్, కాపు సమాఖ్య జిల్లా నాయ కులు పచ్చిపాల రాజా, రట్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగా వర్థంతి కార్యక్రమంలో ముప్పా రాజా, బాయిన నాగరాజు, కుంటా గంగాధర్, పిచుక క్రాంతి, రవి, సుంకర సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం : సావరగూడెంలో రంగా వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాపు ఐక్య సమ్మేళ నం నియోజకవర్గ అధ్యక్షుడు తోట వెంకయ్య పూల మాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ అట్ల నాగేశ్వరరావు, తిరుమలశెట్టి సత్యనారాయణ, చిమట కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర రావు, శ్రీమన్నారాయణ, సూర్యవతి, నిర్మలాంబ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం వైసీపీ కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ అనగాని రవి, అల్లాపురం సర్పంచ్ డొక్కు సాంబశివ వెంకన్నబాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మన్నే సుందరరావు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్ ఇందిరా నగర్‌లో వీఎం రంగా వర్ధంతిని రంగా అభిమాన సంఘం నాయ కులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నక్కా గాంధీ, ఎంపీపీ నగేష్, బాపులపాడు వైస్ సర్పంచ్ దుట్టా శివన్నారాయణ పాల్గొన్నారు. రంగా విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు సుంకర సుభాష్ చంద్రబోస్, గంధం నారాయణ, కోడెబోయిన బాబి, కొమరవల్లి కిరణ్‌మూర్తి, వడ్డి రాము, గంధం రామారావు, నక్కా బాబు, నూకల బాలాజీ, బాలరాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్ : కోడూరుపాడు, కొత్తపల్లి గ్రామాల్లో సోమవారం వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా జనసేన నేత చలమలశెట్టి రమేష్ నివాళులర్పించారు. కోడూరుపాడులో రంగా అభిమానుల ఆధ్వర్యంలో కూడలిలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి పుల్లయ్య, కొండపల్లి వెంకటేశ్వరరావు, చందు శివ, సుధాకర్, ఆళ్ల భాను, శంకర్, వాసన నాగేశ్వరరావు, బసవయ్య, చందు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లిలో ఉపసర్పంచ్ వడ్డి అశోక్, రామిశెట్టి బాలు, షేక్ అబ్దుల్లా, నాగమల్లేశ్వరావు, నాని, పల్నాటి సుదర్శన్, రవి, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.