తుగ్లక్ నిర్ణయాలతో జనం ఇక్కట్లు
ABN , First Publish Date - 2022-10-28T00:17:59+05:30 IST
తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రంలో ఏవర్గం సంతృప్తిగా లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
శాశ్వత అభివృద్ధి పనులేవి
విజయవాడ రూరల్ / గొల్లపూడి, అక్టోబరు 27: తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రంలో ఏవర్గం సంతృప్తిగా లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా గురువారం జక్కంపూడి కాలనీలోని 133 నుంచి 139, 156 నుంచి 159 బ్లాక్‌లతో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 రోజులుగా కాలనీ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జేసీ, సబ్ కలెక్టర్ కాలనీకి రారా? సీఎం, మంత్రులు చెబితే వస్తారా, ఎమ్మెల్యే వద్దంటే ఆగిపోతారా అని ప్రశ్నించారు. బాధ్యతతో పని చేయండి నిన్న, నేడు, రేపు ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని మళ్లీ మీరంతా మా దగ్గర పని చేయాలి గుర్తు పెట్టుకోండని అధికారులకు గుర్తు చేశారు. సీఎం, మంత్రుల కళ్లలో ఆనందం చూసేందుకు పని చేయకండి ప్రజల కోసం పని చేయండని సూచించారు. కార్యక్రమంలో షేక్ కరీముల్లా, షేక్ ఖాశిం, ఆకుచియా శాంతి, పిట్టా వెంకట రమణ, చప్పిడి శ్రీలక్ష్మి, రౌతు రోజా, జంగం సుధారాణి, పడగల స్వామి, అరశంకర మల్లేశ్వరి, షేక్ రజియా, జక్కంపూడి పార్టీ నేతలు గద్దల శివాజీ, అన్నం హనుమంతరావు, బోయిన సుబ్రహ్మణ్యం, పోలుదాసు వెంకటరమణ, దాసరి శ్రీనివాసరావు, చిన్న అప్పలనాయుడు పాల్గొన్నారు.