అల నక్షత్రాలను పోలి..
ABN , First Publish Date - 2022-11-25T00:47:23+05:30 IST
అల నక్షత్ర లోకం ఇలకు జారినట్టు.. తారలన్నీ తళుక్కున మెరిసినట్టు.. కృష్ణాతీరం కాంతివంతమైంది.
విజయవాడ, ఆంఽధ్రజ్యోతి : అల నక్షత్ర లోకం ఇలకు జారినట్టు.. తారలన్నీ తళుక్కున మెరిసినట్టు.. కృష్ణాతీరం కాంతివంతమైంది. కార్తీకమాసం ముగియడంతో భక్తులు గురువారం పోలి అమావాస్యను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే నిద్రలేచి, కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి పోలిని స్వర్గానికి సాగనంపడంతో కార్తీక మాస పూజలను ముగించారు.