MP Raghurama: వారు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను..

ABN , First Publish Date - 2022-12-26T16:16:42+05:30 IST

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, తనపై ట్వీట్‌లతో వైసీపీ నేతలు దాడి చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: వారు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను..

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan), తనపై ట్వీట్‌లతో వైసీపీ నేతలు (YCP Leaders) దాడి చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలో 150 మంది ఎమ్మెల్యేలతో తనపై ట్వీట్‌లు (Tweets) పెట్టిస్తారేమోనని, ట్వీట్‌లు పెట్టినవారిని అభినందిస్తున్నానని అన్నారు. తెరవెనుక నుంచి ట్వీట్లు పెట్టించొద్దని సీఎం జగన్‌ (CM Jagan)కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వారు ఎంత రెచ్చగొట్టినా తాను రెచ్చిపోనని స్పష్టం చేవారు. సాక్షి పేపర్‌.. జంధ్యాల, ఈవీవీలను తలపిస్తోందన్నారు. పెట్టుబడుల వరద అంటున్నారు... రూ.లక్షా 85 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు... ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీకి వస్తారని తెలుస్తోంది.. వచ్చేనెల జీతాలు ఇవ్వాలి కాబట్టి.. ఈనెల వరకు అప్పు తీసుకొచ్చి గట్టెక్కాలని చూస్తున్నారని రఘురామ అన్నారు.

రైతు భరోసా అంటున్నారని, తెలంగాణలో రైతు బంధు కొనసాగుతోందని.. సీఎం కేసీఆర్ ఏదైనా చెప్తే చేస్తారని రఘురామ అన్నారు. మరి ఏపీలో రైతుల దగ్గర నుంచి రూ. 3 వేల కోట్ల పంట కొంటె కేవలం రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. ఉపాధ్యాయుల కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-26T16:16:45+05:30 IST