రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-11-13T01:01:25+05:30 IST
యనమలకుదురు రామలింగేశ్వర స్వామి జన్మనక్షత్రం ఆరుద్ర సందర్భంగా శనివారం ఆలయంలో స్వామివారికి, పార్వతీ దేవికి అర్చకులు గూడూరి రామలింగేశ్వర విద్యాసాగర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగా శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులు గోపూజ నిర్వహించారు. తరువాత స్వామివారికి కుంభాభిషేకం, బంగారు పుష్పాలచే అలంకరణ చేశారు.
పెనమలూరు, నవంబరు 12 : యనమలకుదురు రామలింగేశ్వర స్వామి జన్మనక్షత్రం ఆరుద్ర సందర్భంగా శనివారం ఆలయంలో స్వామివారికి, పార్వతీ దేవికి అర్చకులు గూడూరి రామలింగేశ్వర విద్యాసాగర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగా శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులు గోపూజ నిర్వహించారు. తరువాత స్వామివారికి కుంభాభిషేకం, బంగారు పుష్పాలచే అలంకరణ చేశారు. ఆలయ ఈవో గంగాధర్, ధనలక్ష్మి, పూర్ణచంద్రరావు, రామకృష్ణ, సంగా సింగయ్య, సంగా సుబ్బారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫపెదపులిపాక చెన్నమల్లేశ్వరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు రుద్రాభిషేకం న్విహించారు. అభిషేం అనంతరం లక్షబిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముసునూరి శ్రీనివాస్, వల్లూరు శ్రీమన్నారాయణ, ఘంటా రఘు, ఘంటా వెంకటేశ్వరరావు, మొక్కపాటి పాపారావులు పర్యవేక్షించారు.
ఉయ్యూరు : సోమేశ్వరస్వామి ఆల యంలో శనివారం కార్తీకమాస ఆరుద్ర నక్షత్రం చవితి పుర స్కరించుకుని ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గ్రామోత్సవం, లక్షబిళ్వార్చన, మధ్యాహ్నం మహిళలచే సామూహిక కుంకు మార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుం డా ఆలయ పాలక వర్గ మండలి చైర్మన్ చిందా వీర వెంకట కుటుంబరాజు, ఈవో కె.సురేశ్ బాబు ఏర్పాట్లు చేశారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్ : వీరవల్లి కొండేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో అన్నాభిషేకం నిర్వహించారు. పెరికీడు ముక్తేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు సీతారామయ్య, శ్యామ్ అన్నాభిషేకం, మాహాన్యాస పూర్వక రుద్రాభిషేక విశేష పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మహా అన్నసమారాధనలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన 8వేల మందికి భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనే యులు, లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ శాశ్వత ధర్మకర్త కాకాని వెంకటేశ్వరరావు(బాబు), ఎంపీపీ యరగొర్ల నగేష్, జడ్పీటీసీ సభ్యు రాలు కొమరవల్లి గంగాభవాని, దుట్టా రవిశంకర్, స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచనేని సత్యప్రసాద్, సర్పంచ్ జాన్‌ప్రకాష్, సుంకర బోసు, దుట్టా శివన్నారాయణ పాల్గొన్నారు.