విశ్రాంత ఉద్యోగులను గౌరవించాలి

ABN , First Publish Date - 2022-08-27T05:25:02+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ విశ్రాంత ఉద్యోగులను, సీనియర్‌ ఉద్యోగులను కొత్తగా వస్తున్న ఉద్యోగులు గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్టేట్‌ బ్యాంక్‌ డీజీఎం కె.రంగరాజన్‌ హితవు పలికారు.

విశ్రాంత ఉద్యోగులను గౌరవించాలి

నూతన ఉద్యోగులకు ఎస్‌బీఐ డీజీఎం హితవు

లబ్బీపేట, ఆగస్టు 26 : స్టేట్‌ బ్యాంక్‌ విశ్రాంత ఉద్యోగులను, సీనియర్‌ ఉద్యోగులను కొత్తగా వస్తున్న ఉద్యోగులు గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని స్టేట్‌ బ్యాంక్‌ డీజీఎం కె.రంగరాజన్‌ హితవు పలికారు. శుక్రవారం అమ్మ కల్యాణ మండపంలో స్టేట్‌ బ్యాంక్‌ పెన్షనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్టేట్‌ బ్యాంక్‌ డిపాజిట్లలో 1/3వ వంతు పెన్షనర్ల డిపాజిట్లే ఉన్నాయని బ్యాంక్‌కు పెన్షనర్స్‌ ఎంతో కీలకమని అన్నారు. ఈ సమావేశం కుటుంబ సమావేశమని, ఇందులో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ వినియోగదారుల పట్ల అత్యంత గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తుందని వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో బ్యాంక్‌ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎస్‌బీఐ యోనో యాప్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌ మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ పెన్షనర్స్‌ అసోసియేషియన్‌ అధ్యక్షులు కె.ఎస్‌ రామచంద్రరావు, అసోసియేషన్‌ జెనరల్‌ సెక్రటరీ టి.ఎ్‌స.విఎస్‌ శర్మ, రీజనల్‌ మేనేజర్లు, బ్యాంక్‌ ఉద్యోగులు, పెన్షనర్స్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-27T05:25:02+05:30 IST