లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-11-06T01:04:05+05:30 IST

స్కానింగ్‌ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి, గర్బస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
సమావేశంలో సూచనలు చేస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు

కలెక్టరేట్‌, నవంబరు 5 : స్కానింగ్‌ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి, గర్బస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షల నిషేధిత చట్టం అమలుపై కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం దిల్లీరావు మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా నేరంగా పరిగణించి వారిపై చట్టరిత్యా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 294 స్కానింగ్‌ సెంటర్లున్నాయని, స్కానింగ్‌, ఇమేజింగ్‌ సెంటర్ల అనుమతులకు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి కేంద్రంలోను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రిజిస్టర్లు తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో అప్రోప్రియేట్‌ అథారిటీ అడ్వజరీ కమిటీ సభ్యుడు, మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి, ఏసీబీ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి, అడిషనల్‌ సీపీ పి.వెంకటరత్నం, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-06T01:04:07+05:30 IST