పెళ్లిళ్లపైనా పన్ను వేస్తారేమో?
ABN , First Publish Date - 2022-11-06T00:17:54+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పెళ్లిళ్లు చేసుకున్న వారిపై ఏదో ఒక ట్యాక్స్ వేసేలా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
పెళ్లిళ్లపైనా పన్ను వేస్తారేమో?
బాదుడే బాదుడులో
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమ
పాయకాపురం, నవంబరు 5 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పెళ్లిళ్లు చేసుకున్న వారిపై ఏదో ఒక ట్యాక్స్ వేసేలా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. 63వ డివిజన్లోని సుందరయ్యనగర్ ప్రాంతంలో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికి తిరిగి పెరిగిన ధరలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, విద్యా దీవెన, వివాహ కానుకలు, పండుగ తోఫాలు, సబ్సిడీ పథకాలకు చావుబాజా మోగించారని దుయ్య బట్టారు. వైసీపీ పాలనలో ధరల పెంపు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, ఈ పాలనపై ప్రజలు తిరగబడే సమయం వచ్చిందన్నారు. డివిజన్ టీడీపీ నేతలు లబ్బా దుర్గ, బత్తుల కొండ, లబ్బా వైకుంఠం, కోలా శ్రీని వాసరావు, పట్టిమ రమణ, దుర్గారావు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
గుణదల : కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపు ఇస్తుందనే దానికి 26వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తోట పాండునే ప్రత్యక్ష నిదర్శనం అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. తోట పాండు జన్మదిన వేడుకలు మొగల్రాజపురంలో బొండా ఉమా కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం ఉమా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావు, 27వ డివిజన్ జయరాజు, మధు, కుటుంబరావు, వల్లభనేని సతీష్, నెలిబండ్ల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.