టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలి
ABN , First Publish Date - 2022-12-06T00:54:16+05:30 IST
టిడ్కో ఇళ్లను వెంట నే లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఐ జిల్లా డిప్యూ టీ కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
చిట్టినగర్, డిసెంబరు 5 : టిడ్కో ఇళ్లను వెంట నే లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఐ జిల్లా డిప్యూ టీ కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాల యం ఎదుట సీపీఐ నేతలు లబ్ధిదారులతో కలసి నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం టిడ్కో ఇళ్లను ల బ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని కమిషనర్ స్వప్నిల్ ది నకర్ పుండ్కర్ సీపీఐ నేతలు దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీతో మాట్లాడి ఇళ్లకు సంబంధించి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తానన్నారన్నారు. ఈ సందర్భంగా వక్త లు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే తలంపుతో గత ప్రభుత్వం జక్కంపూడి, వే మవరం, షాబాద్‌లో పక్కా గృహాల నిర్మాణం చేపట్టిందన్నారు. సుమారు 11వేల మంది రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు కట్టారన్నారు. కానీ డిపాజిట్లు కట్టించుకొని 6576 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 90శాతం నిర్మాణం పూర్తి చేశారన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేటివరకు లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. అధికారంలోకి వస్తే ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి ఉచితంగా ఇస్తామని, కట్టిన డిపాజిట్లు వెనక్కి ఇస్తామని, బ్యాంకులకు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అప్పగించలేదన్నారు. లబ్ధిదారులు ఇళ్లు వస్తాయో, రావోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టిన డిపాజిట్లకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారన్నారు. కార్యదర్శి వర్గసభ్యులు బుట్టి రాయప్ప, తాడి పైడియ్య, కె.వి.భాస్కరరావు, పంచదార్ల దుర్గాంబ, కార్యదర్గ సభ్యులు డీవీ రమణబాబు, కొట్టు రమణరావు, అప్పురుబోతు రాము, తూనం వీరయ్య కొడాలి ఆనందరావు, ఓర్సు భారతి, సంగుల పేరయ్య, దోనేపూడి సూరిబాబు, ఎల్.శివకుమార్, పడాల కనకరావు, పూసర్ల లక్ష్మణరావు, అంబడిపూడి మోహన్‌రావు, కొండపల్లి కృష్ణ కాట్రగడ్డ వాసు పాల్గొన్నారు.