కట్లేరు వంతెనపై రాకపోకలు నిలిపివేత
ABN , First Publish Date - 2022-10-14T05:46:59+05:30 IST
కట్లేరుపై వంతెన పూర్తిగా ధ్వంసం కావడంతో గంపలగూడెం - చీమలపాడు ఆర్‌అండ్‌బీ రహదారిలో రాకపోకలను పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు గురువారం నుంచి పూర్తిగా నిలిపివేశారు.
గంపలగూడెం, అక్టోబరు 13: కట్లేరుపై వంతెన పూర్తిగా ధ్వంసం కావడంతో గంపలగూడెం - చీమలపాడు ఆర్‌అండ్‌బీ రహదారిలో రాకపోకలను పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు గురువారం నుంచి పూర్తిగా నిలిపివేశారు. వంతెనపై రాకపోకలు ప్రమా దకరంగా ఉండటంతో కాలినడకన వెళ్లేవారిని సైతం అపేసినట్టు ఎస్సై వి.సతీష్ తెలిపారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో మైక్‌ద్వారా ప్రచారం చేశారు. రహదారి ఏర్పాటు చేసే వరకు వేరే మార్గం నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు. ఈ సందర్భంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు నిర్వహించారు.