సీఎంఆర్‌ఎఫ్ ఏమైంది ?
ABN , First Publish Date - 2022-11-01T00:21:50+05:30 IST
అత్యవసరంగా వైద్యం చేయించుకునే పేదల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్‌ఎఫ్ పేదలకు సంజీవ నిలా ఉండేదని అటువంటి పథకం జగన్ ప్రభుత్వంలో ఏమైందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు.
సీఎంఆర్‌ఎఫ్ ఏమైంది ?
బాదుడే బాదుడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె ప్రశ్న
రామలింగేశ్వరనగర్, అక్టోబరు31: అత్యవసరంగా వైద్యం చేయించుకునే పేదల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్‌ఎఫ్ పేదలకు సంజీవ నిలా ఉండేదని అటువంటి పథకం జగన్ ప్రభుత్వంలో ఏమైందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. సోమవారం 16వ డివిజన్ కళానగర్‌లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ప్రైవేట్ హాస్పటల్‌లో వైద్యం చేయించుకోవటం కష్టమైన విషయమని, ఆరోగ్యశ్రీ కూడా రెండు రోజులు సమయం పడుతుందని అటువంటి సమయంలో అప్పులు తెచ్చి వైద్యం చేయించుకోవడం జరిగేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా పేదలకు కోట్ల రూపాయలు అందించారని, వైద్యం తరువాత ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బుతో వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చుకునేవారన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని పేదలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. అనంతరం డివిజన్‌కు చెందిన ఎస్.కుమారికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండి, శివకు ఇస్త్రీ బండిని అందజేశారు. రత్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు..