Kurnool Dist.: మంత్రి గుమ్మనూరు భిక్ష నాకు అవసరం లేదు: జడ్పీటీసీ విరుపాక్షి
ABN , First Publish Date - 2022-12-23T12:51:50+05:30 IST
కర్నూలు జిల్లా: ఆలూరు వైసీపీ (YCP)లో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఈ నేపథ్యంలో చిప్పగిరి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు విరుపాక్షి (Virupakshi) సిద్ధమయ్యారు.
కర్నూలు జిల్లా: ఆలూరు వైసీపీ (YCP)లో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఈ నేపథ్యంలో చిప్పగిరి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు విరుపాక్షి (Virupakshi) సిద్ధమయ్యారు. గుమ్మనూరు బిక్ష వల్లే విరుపాక్షి జడ్పీటీసీ అయ్యారని, ప్రతి మీటింగ్‌లోనూ మంత్రి జయరాం అనుచరులు మాట్లాడుతున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విరుపాక్షి.. గుమ్మనూరు బిక్ష తనకు అవసరం లేదని.. సోమవారం జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ అభిమానంతో వైసీపీలోనే కొనసాగుతానని విరుపాక్షి స్పష్టం చేశారు.