ప్రాధాన్యత రంగాలకు రుణాలివ్వండి: కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-31T00:26:57+05:30 IST
జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బ్యాంకర్లను ఆదేశించారు.
నంద్యాల టౌన్, డిసెంబరు 30: జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో జిల్లా బ్యాంకర్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్స రానికి నాబార్డు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ అంచనా మొత్తం రూ.10,266.98 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఆర్థిక ప్రగతి లక్ష్య సాధనలో బ్యాంకర్లు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, ఇందుకు సంబంధించి అన్ని రకాల బ్యాంకు శాఖలు అర్హత పొందిన లబ్ధిదారులకు వెంటనే రుణాలు ఇవ్వాల ని ఆదేశించారు. కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణ, నాబార్డు డీడీఎం పార్థువ, ఆర్‌బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రెహమాన్, కేడీసీసీ జిల్లా మేనేజర్ శివలీల, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీనివాస యాదవ్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.