పొట్టి శ్రీరాములు, పటేల్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-12-16T00:30:40+05:30 IST

స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో గురువారం పొట్టి శ్రీరాములు, సర్దార్‌ వల్లభా య్‌ పటేల్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

పొట్టి శ్రీరాములు, పటేల్‌కు ఘన నివాళి
పటేల్‌, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నివాళి అర్పిస్తున్న ప్రిన్సిపాల్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 15: స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో గురువారం పొట్టి శ్రీరాములు, సర్దార్‌ వల్లభా య్‌ పటేల్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్‌, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌, అధ్యాపకులు పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో లెక్చరర్లు వైవీ రామకృష్ణ, విజ యశేఖర్‌, పార్థసారధి పటేల్‌, జబీన్‌ అక్తర్‌, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

కర్నూలు(కల్చరల్‌): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పొట్టి శ్రీరాములు, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే.ప్రకాష్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌ వి.పెద్దక్కలు పొట్టి శ్రీరాములు, పటేల్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారులు వజ్రాల గోవిందరెడ్డి, చంద్ర మ్మ, నషీమాబీ, ఎస్‌.బాషా, ఈశ్వరమ్మ, ఉమ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు(న్యూసిటీ): నగర పాలక సంస్థ కౌన్సిల్‌ హాలులో పటేల్‌, పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటాలకు కమిషనర్‌ ఏ.భార్గవ తేజ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ఎస్వీ. రమాదేవి, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, కార్పొరేషన్‌ కార్యదర్శి లావణ్య, మేనేజరు చిన్న రాముడు, టౌన్‌ప్లానింగ్‌ అధికారి ప్రదీప్‌కు మార్‌, ఆరోగ్యశాఖా ధికారి విశ్వేశ్వరరెడ్డి, వివిధ విభాగాల సూపరింటెండెట్లు పాల్గొన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌): ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలే నిదని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. గురువారం అమరజీవి పొట్టి శ్రీరామలు వర్ధంతి సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్‌ భార్గవ్‌ తేజతో కలిసి కలెక్టర్‌ కోటేశ్వరరావు ఎస్‌బీఊ మెయిన్‌ బ్రాంచ్‌ సర్కిల్‌ వద్ద ఉన్న పొట్టి శ్రీరా ములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా టీడీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి పీజీ నరసింహులు యాదవ్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహర దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టిశ్రీరాములు అని కొనియాడారు. కార్యక్ర మంలో రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, పోతురాజు రవికుమార్‌, సోమిశెట్టి నవీన్‌, పీజీ గోపినాథ్‌ యాదవ్‌, చంద్రకళాబాయి, ఆశాలత, తిరుపాలు బాబు, అబ్బాస్‌, పరమేష్‌, సత్రం రామకృష్ణుడు, బీసీ సెల్‌ రామాంజినేయులు, కిరణ్‌, నాగరాజు పాల్గొన్నారు.

కర్నూలు(అర్బన్‌): జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం పొట్టి శ్రీరాములు, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రప టాలకు డీసీసీ అధ్యక్షుడు ఎం.సుధాకర్‌ బాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నగర్‌ అధ్య క్షులు జాన్‌విల్సన్‌, అశోకతర్నం, దామో దరం రాఽధాకృష్ణ, ఐఎన్‌టీ యూసీ జిల్లా అధ్యక్షుడు బ్రతుకన్న, పోతుల శేఖర్‌, మద్దిలేటి, ఖాజాహుసేన్‌, బీవీ సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి, ప్రభావతి పాల్గొన్నారు.

గూడూరు: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు అన్నారు. గురువారం గూడూ రు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వే సి నివాళి అర్పించారు. టీడీపీ నాయకులు విజయరాఘవ రెడ్డి, మన్నన్‌ బాషా, నాగప్పయాదవ్‌, సులేమాన్‌, మునగాల కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:30:45+05:30 IST