Minister Peddireddy Ramachandra Reddy: ప్రభుత్వ కార్యక్రమాలకు సిమెంట్ సరఫరాలో అలసత్వం వద్దు
ABN , First Publish Date - 2022-10-28T18:57:29+05:30 IST
సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) సమీక్ష నిర్వహించారు.
అమరావతి: సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సిమెంట్ సరఫరాలో అలసత్వం వద్దని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు మంత్రి స్పష్టంగా చెప్పారు. సిమెంట్ కొరత వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడటం సరికాదన్నారు. నాడు-నేడు, గృహనిర్మాణం, రహదారులు, ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని, సిమెంట్ కంపెనీల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు.