Home » Peddireddi Ramachandra Reddy
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఎవరి స్క్రిప్ట్ చదువుతుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్లో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రాజెక్టు కట్టేందుకు ఎటువంటి అనుమతులూ లేవు.. అయినా అడ్డగోలుగా కట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పోలీసులతో భయపెట్టి.. మూడు కార్తెలు పండే తల్లిలాంటి భూములు లాక్కున్నారు. పైసా పరిహారం ఇవ్వకుండానే.. దౌర్జన్యంగా పట్టాదార్ పాస్పుస్తకాలూ తీసేసుకున్నారు.
మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు...
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండొచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు...
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!
Andhrapradesh: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు పెద్దలు ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మంత్రి హోదాలో ఉంటూనే దౌర్జాన్యాలకు, కబ్జాలకు తెరలేపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎందరో. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు.
గత 25 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయామని పుంగనూరు టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి కుటుంబం తమ గుప్పెట్లో పెట్టుకుని నియంతలా వ్యవహరించారన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం భాషాతో పాటు కౌన్సిలర్లు అభివృద్ధి కోసం పోరాటం చేసినా పెద్దిరెడ్డి నియంత పోకడల ముందు ఏమి చేయలేకపోయారన్నారు.
అంగళ్లతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టిన తప్పుడు కేసులపై పునర్ విచారణ చేయిస్తామని.. దోషులను వదిలి పెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వార్నింగ్ ఇచ్చారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి హోం మంత్రి అనిత ఈరోజు( శనివారం) వచ్చారు.