యానాదలపై నాదేండ్ల మనోహర్ ప్రస్తావన
ABN , First Publish Date - 2022-10-31T16:53:55+05:30 IST
: ప్రజల బాధలు తెలుసుకొనే ఓపిక లేదుగానీ... ఫోన్ చేసి చెబితే సమస్యలు తీరుస్తారా? అని జనసేన (janasena) నేత నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ప్రశ్నించారు.
అమరావతి: ప్రజల బాధలు తెలుసుకొనే ఓపిక లేదుగానీ... ఫోన్ చేసి చెబితే సమస్యలు తీరుస్తారా? అని జనసేన (janasena) నేత నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ప్రశ్నించారు. సీఎం (cm jagan) సామాన్యులను కలవరు... కష్టాలు తీర్చరని ఆవేదన వ్యక్తం చేశారు. 12 లక్షల మంది యానాదుల్ని ముఖ్యమంత్రి మోసం చేశారని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా ప్రజల కష్టాలు ఆలకించే తీరిక లేదన్నారు. జనవాణి చూసి ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రజలు గుర్తుకొచ్చారని అన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్‌ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యానాదులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు. రూ.10 లక్షల ఆర్థిక భరోసా యానాదులకు వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పవన్ కళ్యాణ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.