చెరువులను తలపిస్తున్న జగనన్న లేఅవుట్లు
ABN , First Publish Date - 2022-11-13T23:22:24+05:30 IST
జగనన్న లేఅవుట్లు చినుకు పడితే చెరువును తలపిస్తున్నాయని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు(క్రైం), నవంబర్ 13 : జగనన్న లేఅవుట్లు చినుకు పడితే చెరువును తలపిస్తున్నాయని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జనసేన చేపట్టిన జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం రెండురోజు ఆదివారం అల్లీపురంలోని టిడ్కో ఇళ్లు, వావిలేటిపాడు జగనన్న లేఅవుట్ల వద్ద కొనసాగింది. మనుక్రాంత్‌రెడ్డి మాట్లాడుతూ వావిలేటిపాడులో జగనన్న లేఅవుట్ చిన్నపాటి వర్షాలకు చెరువును తలపిస్తోందని, ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.