ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అవకతవకలు

ABN , First Publish Date - 2022-12-11T23:40:02+05:30 IST

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో అవకతవకలు కన్పిస్తున్నాయని, వలంటీర్లు, అధికారులు, వైసీపీ కార్యకర్తలు సిగ్గులేకుండా దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని టీడీపీ మండల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అవకతవకలు
2001లో పుట్టినతేదీ కలిగిన వ్యక్తికి జాబితాలో ఉన్న ఓటు

పొదలకూరు, డిసెంబరు 11 : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో అవకతవకలు కన్పిస్తున్నాయని, వలంటీర్లు, అధికారులు, వైసీపీ కార్యకర్తలు సిగ్గులేకుండా దొంగ ఓట్లను నమోదు చేయిస్తున్నారని టీడీపీ మండల నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదులో లెక్కకు మించి అవకతవకలు జరిగాయని టీడీపీ మండలాద్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు ప్రకటనలో తెలిపారు. 2001లో పుట్టినవారు కూడా 2019 సంవత్సరం కల్లా డిగ్రీపూర్తి అయినట్లు, ఓటు నమోదు చేశారని, వారికి ఓటు వచ్చిందని తెలిపారు. జాబితాలో పేర్లు, చిరునామాలు సరిగా లేవని, వాటన్నింటిని సరిచేయాల్సిన బాధ్యత అధికారులు, ఎన్నికల కమిషన్‌పై ఉందని తెలిపారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేసినట్టేనని ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-11T23:40:40+05:30 IST