నాగవరప్పమ్మదేవికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-11-27T23:45:56+05:30 IST

మండలంలోని కోలగట్ల పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న నాగవరప్పమ్మదేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు.

నాగవరప్పమ్మదేవికి ప్రత్యేక పూజలు
నాగవరప్పమ్మదేవికి పూజలు చేస్తున్న భక్తులు

సంగం, నవంబరు 27: మండలంలోని కోలగట్ల పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న నాగవరప్పమ్మదేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకాలు చేసి, పూలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పొంగళ్లు పొంగించి, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకుడు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నిర్వాహకులు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-11-27T23:46:17+05:30 IST